తిరువూరు పట్టణం 20వ వార్డులో ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు ప్రవేశ పెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. టీడీపీని గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చిన్న కోడలు స్వాతి ఇంటింటి ప్రచారం చేస్తూ రెండు ఓట్లు ఫ్యాను గుర్తుకు వేయమని ఓట్లర్లను అభ్యర్థించారు.
సీఎం జగన్ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే మమల్ని గెలిపిస్తాయని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు తెలిపారు. ఇక, మార్కాపురం నియోజకవర్గ ప్రజలు వివేకవంతులు.. వారు వైసీపీకి అండగా ఉంటారని చెప్పారు.
జనసేన సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అనే విషయాన్ని ప్రకటించిన ఆయన అదే మీటింగ్లో అనేక విషయాలను తన పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో పంచుకున్నారు.