కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ మూవీ..సెప్టెంబర్ 15 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ కోలీవుడ్ లో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. వంద కోట్ల వసూళ్లను రాబట్టి విశాల్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. తెలుగు లో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల్ని అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో మార్క్, ఆంటోనీ గా రెండు పాత్రల్లో విశాల్ కనిపించి మెప్పించాడు.. అతడి నటన తో పాటు లుక్స్ విషయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.టైమ్ ట్రావెల్ కాన్సెస్ట్ తో రూపొందిన ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ఎస్‌జే సూర్య, సునీల్, రీతూ వర్మ మరియు అభినయ ముఖ్య పాత్రలు పోషించారు.అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడన్నది క్లారిటీ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అక్టోబర్ 13 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే..మార్క్ (విశాల్) తండ్రి ఆంటోనీ ఓ గ్యాంగ్‌స్టర్. ఓ గొడవల్లో అతను చనిపోతాడు. తండ్రి కారణంగా మార్క్ ఎన్నో ఇబ్బందులు పడుతోంటాడు. తండ్రిపై ద్వేషంతో రగిలిపోయే అతడికి ఓ టైమ్ ట్రావెల్ ఫోన్ ద్వారా గతంలోకి వెళ్లి ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుంది.. అయితే ఆ తర్వాత ఏమైంది.. తన తండ్రిని మార్క్ కలుసుకున్నాడా..తండ్రి విషయంలో తాను చేసిన తప్పును మార్క్ ఎలా సరిదిద్దుకున్నాడన్నదే ఈ సినిమా కథ. 1975 మరియు 1995 బ్యాక్‌డ్రాప్‌లలో ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్. తెలుగు మరియు తమిళంలో రిలీజైన ఈ మూవీ హిందీలో మాత్రం సెన్సార్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనింది.. మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ సెన్సార్ కోసం ఆరున్నర లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఇటీవల విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.