మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు శంషాబాద్‌కు చేరకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీష్, పోలీస్ అధికారులు మహేష్ భగవత్ శంషాబాద్ సీపీపీ నారాయణరెడ్డి విద్యార్థులకు స్వాగతం పలికారు. మణిపూర్ ఇంపాల్ నుండి ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ప్రత్యేక విమానంలో 72 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుండి వారికి కేటాయించిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో నగరానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
Also Read : CM YS Jagan: సిక్కులకు సీఎం గుడ్‌న్యూస్.. ప్రత్యేక కార్పొరేషన్, మరిన్ని ప్రయోజనాలు..
మణిపూర్ లో దారుణమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో తమకు ఎంతో ఇబ్బందులు కలిగినప్పటికీ ధైర్యంగా హాస్టల్లో నిలబడ్డామని విద్యార్థులు తెలిపారు. గత ఐదు రోజుల నుండి పూర్తిగా ఇంటర్నెట్ పనిచేయలేదని అక్కడ మాకు ఆహారం లభించక పస్తులు ఉన్నామని విద్యార్థులు తెలిపారు. అల్లరిమూకలు తాగు నీటిలో విష పదార్థాలు కలిపి సరఫరా చేసేందుకు ప్రయత్నించారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో తామందరంతా సురక్షితంగా రాష్ట్రానికి చేరుకున్నామని తమను సురక్షితంగా రాష్ట్రానికి తరలించిన కేసీఆర్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Rahul Gandhi : మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన రాహుల్ గాంధీ..