West Bengal: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది.
Mamata Banerjee: కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సయోధ్య కుదిరినట్లుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది.
కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఉప ఎన్నికలు జూన్ 30న జరుగుతాయని తెలిపింది.
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లో అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. శతృఘ్నసిన్హా (తృణమూల్ కాంగ్రెస్), బాబుల్ సుప్రియో (తృణమూల్ కాంగ్రెస్) విజయం సాధించారు. అస్సనోల్ లోక్‌సభను గతంలో బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఆ స్థానం అధికార పార్టీ టీఎంసీ వశమైంది.…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరికొద్దిరోజుల్లో కొలిక్కి రానుంది. ఆశావహులు కేసీఆర్ ని ప్రసన్నం చేసుకుని పదవులు పొందేరు. చాలామటుకు ఎమ్మెల్సీ పీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్నింటికి డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పెద్దల సభకు వెళ్ళాలనుకునేవారి కల సాకారం అయింది. ఇందులో చాలామంది రెండుసార్లు ఎమ్మెల్సీ సీట్లు పొందారు. పదవులు రానివారు నామినేటెడ్ పదవుల వైపు మొగ్గుచూపుతున్నారు. 2014లో తెలంగాణ కల సాకారం అయ్యాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండోసారి…
నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదు.…
భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ.. కీలక ఎన్నిక ఎదుర్కోబోతున్నారు. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడినప్పటికీ.. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇందుకోసం భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మమత పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో…