Mancherial: సర్కార్ ఉద్యోగం కోసం ఆరేళ్లు కష్టపడ్డాడు. రెండుసార్లు సర్కార్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉద్యోగం రాలేదనే బాధతో వున్న అతనికి అనారోగ్యంతో అక్క, తల్లి చనిపోవడంతో మరింత కుములిపోయాడు. ఇక ప్రభుత్వ ఉద్యోగం రాదని భావించిన ఆ యువకుడు చివరకు తీవ్ర మనస్తాపానికి గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ యువకుడు చనిపోయి నాలుగేళ్ల తరువాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటూ పోస్ట్ రావడం పోస్ట్ మాన్ కే కాదు.. ఆ ఊరినే కంటతడి తెప్పించింది. మరణానంతరం సర్కార్ కొలువు దీరిన వార్త మంచిర్యాల జిల్లాలో ప్రతి ఒక్కరికి తీవ్ర ఆవేదనకు గురిచేసింది.
Read also: Train Stuck On Bridge: బ్రిడ్జి మీద ఆగిన రైలు.. గాల్లో వేలాడుతూ రిపేర్ చేసిన లోకోపైలట్లు..
మంచిర్యాల జిల్లా సింగరేణి మండలం మందమర్రి మొదటి మండలానికి చెందిన సిద్దెంకి మొండయ్య, సరోజ దంపతులకు నవీన్‌కుమార్, అనూష, ఆదిత్య, జీవన్‌కుమార్ నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు మానసిక వికలాంగులు. జీవన్ కుమార్ 2014లో ఐటీఐ పూర్తి చేసి.. 2018లో విడుదలైన ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లైన్ మెన్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. ఎట్టి పరిస్థిల్లో అయినా సరే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో పరీక్ష కూడా రాసి ఫలితాల కోసం ఎదురుచూశాడు. అదే సమయంలో అక్క ఆదిత్య 2018లో అనారోగ్యంతో చనిపోగా.. ఆ వెంటనే తల్లి సరోజ కూడా 2019 జనవరిలో అనారోగ్యంతో మరణించింది. జీవన్ కుమార్ కు ఒకవైపు వరుస విషాదాలతో బాధపడుతున్న.. మరోవైపు ఉద్యోగం రాక తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
Read also: Fire Accident : గురుగ్రామ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్
సింగరేణిలో ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమై 2020 మార్చి 15న జీవన్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జీవన్ మరణించిన ఏడాదిలోనే అక్క అనూష, తండ్రి మొండయ్య మృతి ఇంటిని వల్లకాడు చేసింది. ఆరుగురు కుటుంబ సభ్యులున్న ఇంట్లో వరుస మరణాలతో పెద్ద కుమారుడు నవీన్ ఒంటరిగా మిగిలాడు. బతకడానికి ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన ఇంటికి పోస్టుమాస్టర్ వచ్చి కంటతడితో ఒక పోస్ట్ ను నవీన్ చేతిలో పెట్టాడు. అది చూసిన నవీన్ భావోద్వేగానికి గురయ్యాడు. అయ్యె అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. అప్పుడే సర్కార్ కరునించి ఉంటే ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండేవాడిని అంటూ గుండెలు పగిలేలా రోదించాడు. నవీన్ ను చూసిన స్థానికులు కంతడితో అతన్ని ఓదార్చారు. ప్రభుత్వం నవీన్ ను ఆదుకోవాలని కోరుతున్నారు.
NTR31 : ప్రశాంత్ నీల్ డ్రాగన్ మూవీలో రాక్షసుడిగా ఎన్టీఆర్..?