Train Stuck On Bridge: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైలు బ్రిడ్జ్ మీద ఆగిపోయింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లు చేశారు. వారిలో ఒక లోకో పైలెట్ అయితే, ఏకంగా బ్రిడ్జి మీద అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లను పూర్తి చేశారు.
Read Also: Fire Accident : గురుగ్రామ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..మరణాల సంఖ్య పెరిగే ఛాన్స్
కాగా, యూపీలోని నర్కటీయా గోరఖ్‌పూర్ ప్యాసెంజర్ రైలు.. శుక్రవారం నాడు మార్గమధ్యంలో ఓ రైల్వే బ్రిడ్జిపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. ఇంజెన్‌లోని అన్‌లోడర్ వాల్వ్‌లో అకస్మాత్తుగా గాలి పీడనం తగ్గిడంతో ట్రైన్ సడెన్ గా ఆగిపోయింది. అయితే, మరమ్మతులు చేసేందుకు టెక్నీషియన్లు రావడానికి కొంత ఆలస్యం అవుతుందని ప్రధాన లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ గుర్తించారు. దీంతో, తామే స్వయంగా ఇష్యూను పరిష్కరించేందుకు పెద్ద సాహసం చేశారు. ఇక, లోకో పైలట్లలో ఒకరు ట్రైన్ కింద దూరి రిపేర్లు చేస్తుండగా.. మరో లోకో పైలట్ అత్యంత సాహసోపేతంగా బ్రిడ్జి అంచులను పట్టుకుని వేలాడుతూ.. నడుస్తూ సమస్య ఉన్న చోటుకు వెళ్లి మరమ్మతులు చేస్తున్నాడు.