ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో పురాతన జూలాజికల్ పార్కులలో ఒకటి. ఈ పార్కులో పలు రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు అక్కడి అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. కాగా, కాన్పూర్ జూ పార్కు అధికారులు పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించేందుకు వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా పార్కును సందర్శించే ఛాన్స్ కల్పించారు. ఇక, తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పలువురిని కాన్పూర్ జూ పార్క్ కి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలన్నారు.. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
Read Also: Kurnool TDP: టీడీపీకి తలనొప్పిగా కర్నూలు.. ఐదు నియోజకవర్గాల్లో అదే తీరు..!
అయితే, ఈ కార్యక్రమానికి ‘కాన్పూర్ దర్శన్’ అనే పేరును జూ పార్క్ అధికారులు పెట్టారు. ఇక, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ షెఫాలీ రాజ్ మాట్లాడుతూ.. జూలో నిర్వహిస్తున్న ఈ పోటీ ఉద్దేశ్యం దేశం నలుమూలలలోని ప్రజలకు కాన్పూర్ జూ పార్కు గురించి తెలిసి.. వారు ఇక్కడికి వచ్చేలా చేసేందుకే ఇలా చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు రూపొందించే రీల్స్‌లో అత్యధికులు లైక్ చేసిన రీల్‌కు 5 వేల రూపాయలు, ఆ తరువాత ఉన్న రీల్‌కు 3 వేల రూపాయల నగదు బహుమతి అందించనున్నామని పేర్కొన్నారు.