చిరుతలు, సింహాలు, పులులు... ఈ మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. వాటి భయంకరమైన గర్జన గుండెల్ని పిండేస్తుంది. మనుషుల్ని క్షణాల్లో మట్టుబెట్టే శక్తి వాటి సొంతం. అందుకే వాటిని చూస్తేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటాం. కానీ, కొందరు మాత్రం సాహసం అనే పదానికి కొత్త అర్థం చెబుతున్నారు. అలాంటి వారే ఈ అడవి జంతువులను పెంపుడు జంతువులుగా మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు కోకొల్లలు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి…
సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బహ్రైచ్‌లో ఇటీవల తోడేళ్ల దాడి జరిగిన తర్వాత ఇప్పుడు కాన్పూర్ సమీపంలోని గ్రామాల్లో నక్కల దాడులు పెరిగాయి. రెండు వేర్వురు ఘటనల్లో 10 ఏళ్ల బాలుడు సహా అనేక మంది గ్రామస్తులను గాయపడ్డారు.
తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పలువురిని కాన్పూర్ జూ పార్క్ కి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలన్నారు.. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు వెల్లడించారు.
పులి పంజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే దానిని వెంటాడి వేటాడే వరకు వదలదు. అడవుల్లో ఆహారం లేక పులులు నిత్యం గ్రామాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పశువులపై దాడి చేయాలని భావించిన పులికి ఎదురు దెబ్బ తగిలింది.
అడవుల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గోళ్లు, చర్మం కోసం పెద్ద పులులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది. అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా..…