బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యాలని సమావేశంలో చర్చించామన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండల కమిటీ లను ఈనెలాఖరు వరకు ఫైనల్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పామన్నారు. డిజిటల్ మెంబర్ షిప్ వాడుకోవాలని, రాచరిక పాలన, అవినీతి, కుటుంబ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పామన్నారు మహేష్ కుమార్ గౌడ్. భట్టి పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారని, నల్గొండ జిల్లాలో భట్టి యాత్ర సాగుతోందని ఆయన వెల్లడించారు. కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ లు తెలంగాణ సంపాదను లూటీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్ణాటక తరహాలో తెలంగాణాలో అధికారం వచ్చేలా పనిచేయాలని చెప్పడం జరిగిందన్నారు.
Also Read : Apsara Case : అప్సర హత్య.. రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
ఇదిలా ఉంటే.. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని తప్పుకుండా గుర్తిస్తుందని రేవంత్రెడ్డి అన్నారు. ఇందుకు కర్ణాటకలో మంత్రి పదవి దక్కించుకున్న బోసురాజే ఉదాహరణ అని చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు తీర్మానాలు చేసినట్లు రేవంత్ తెలిపారు. ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు, నదీమ్ జావీద్‌లను అభినందిస్తూ, కొత్తగా నియమితులైన సెక్రెటరీలకు స్వాగతం పలుకుతూ 2 వేర్వేరు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. బోయిన్‌పల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ శంఖుస్థాపనకు సోనియాగాంధీని ఆహ్వానించాలని సభ మరో తీర్మానం చేసిందని చెప్పారు.
Also Read : Joint Pains Tips : వేడి పాలల్లో ఇది కలిపి తాగితే కీళ్ల నొప్పులు మాయం..