హైదరాబాద్‌లోని శంషాబాద్‌లోని అప్సర హత్య కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే.. అప్సర హత్య రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ నుండి సాయి కృష్ణ అప్సర మధ్య పరిచయం ఉన్నట్లు రిమాండర్ రిపోర్ట్‌లో వెల్లడించారు పోలీసులు. అంతేకాకుండా.. ‘బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ. తరచూ అప్సరకు వాట్సాప్ ద్వారా మెసేజెస్ చేసిన సాయి కృష్ణ. నవంబర్లో గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం, ద్వారక గుడిని సాయి కృష్ణ , అప్సర సందర్శించారు. నవంబర్‌లో గుజరాత్ వెళ్లిన తర్వాత మరింత బలపడిన సాయి కృష్ణ, అప్సర మధ్య బంధం. వాట్సాప్ ద్వారా లవ్ ప్రపోజ్ చేసింది అప్సర. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన అప్సర. తనను పెళ్లి చేసుకోకపోతే సాయి కృష్ణను రోడ్డుకు ఈడుస్తానను బ్లాక్ మెయిల్ చేసింది అప్సర. దీంతో.. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయి కృష్ణ హత్య చేశాడు. హత్యకు వారం రోజుల ముందు ఇంటర్నెట్‌లో సాయి కృష్ణ శోధించాడు. “How to Kil human being” అని గూగుల్లో సాయి కృష్ణ వెతికాడు. తనను కోయంబత్తూర్ కు తీసుకెళ్లాలని పలుమార్లు సాయి కృష్ణను కోరిన అప్సర.
Also Read : Tech News: మీ వాట్సాప్ చాట్ ను ఎవ్వరికి కనిపించకుండా ఉండాలంటే ఇలా చెయ్యాల్సిందే..
అప్సరను చంపేందుకు కోయంబత్తూర్ టూర్ ను అడ్డుపెట్టుకున్న సాయి కృష్ణ. 3వ తేదీ రాత్రి 9 గంటలకు కోయంబత్తూర్ కు టికెట్ బుక్ చేశానని అప్సరను నమ్మించిన సాయి కృష్ణ. సాయి కృష్ణ మాటలు నమ్మి సరూర్నగర్ నుండి కారులో వచ్చేసిన అప్సర. 8:15 నిమిషాలకు సరూర్నగర్ నుంచి కార్ లో బయలుదేరారు అప్సర, సాయికృష్ణ. 9 గంటలకు శంషాబాద్ కు చేరుకున్న ఇద్దరు.. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్న తర్వాత టికెట్ బుక్ చేయలేదని అప్సరతో సాయికృష్ణ చెప్పాడు. అక్కడినుండి గోషాలకి వెళ్తున్నట్టు చెప్పిన సాయికృష్ణ.. డిన్నర్ కోసం రాల్లగూడ వద్ద ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆపాడు సాయి కృష్ణ. అప్పటికే ఒకసారి ఆరోగ్యం బాలేక వాంతి చేసుకున్న అప్సర.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డిన్నర్ చేసిన సాయి కృష్ణ.. 12 గంటలకి సుల్తాన్ పల్లి లో ఉన్న గోశాల వద్దకు చేరుకున్న ఇద్దరు.. 3:50 కు వెంచర్ సైడ్ వెళ్లిన ఇద్దరు.. నిద్ర లో ఉన్న సమయంలోనే అప్సర ను సాయి కృష్ణ హత్య చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు పోలీసులు.
Also Read : Arjun – Shruti Case: అర్జున్-శృతి ‘మీటూ’ కేసులో కొత్త ట్విస్ట్.. శృతికి కోర్టు నోటీసులు