మహేష్ గుంటూరు కారం సంక్రాంతికి విడుదల కాబోతుంది.అక్టోబర్ లోగా అంటే దసరా లోగా షూటింగ్ పూర్తయ్యేలా మూవీ టీం స్పీడ్ పెంచుతోంది.మహేశ్ అభిమానులకు ఇప్పుడు రాజమౌళి చేదు వార్త రెడీ చేశాడని తెలుస్తుంది.. అదే ఫ్యాన్స్ ని బాగా కంగారు పెట్టేలా చేస్తుంది.
గుంటూరు కారం అక్టోబర్ లోగా పూర్తైతే, నవంబర్ నుంచి రాజమౌళి మూవీ తాలూకు వర్క్ షాప్ షురూ అవుతుంది అని సమాచారం.. ఆ వర్క్ షాపుతో 6 నెలలు మహేశ్ బాబు సెట్లో బిజీ అవుతాడని తెలుస్తుంది.. వచ్చే సమ్మర్ ఎండింగ్ నుంచి షూటింగ్ షురూ అని తెలుస్తుంది. కాని అక్కడే బ్రేక్ పడుతోందని సమాచారం. బాహుబలి వంటి భయాలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని డైలామాలోకి నెట్టేలా ఉన్నాయని సమాచారం.
బాహుబలి రెండు భాగాలుగా అయితే వచ్చింది. అచ్చంగా అలానే మహేశ్ బాబు మూవీని రాజమౌళి ప్లాన్ చేశాడని తెలుస్తుంది.. ఇలా చేస్తాడని మొదట్నుంచి అనుమానాలు అయితే వున్నాయి.. కాని కథ కలిసిరావటంతో, రెండు భాగాలు తప్పట్లేదని సమాచారం.బడ్జెట్ కూడా 1500 కోట్లకు పెరగనుంది.బాహుబలి 180 కోట్లతో మొదలు పెట్టి 350 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారని తెలుస్తుంది..దానికి కారణం ఒక కథ అనుకున్న అది కాస్త రెండు భాగాలుగా ప్లాన్ చేయాల్సి వచ్చింది.అంతా కథ లెంథ్ పెరగటం వల్లే అన్నారని తెలుస్తుంది.అలాంటి పరిస్థితే మళ్ళీ మహేశ్ బాబు మూవీకి వచ్చిందని సమాచారం.మహేశ్ బాబుతో రాజమౌళి తీయబోయేది పాన్ వరల్డ్ మూవీ అని అందులోనూ 1500 కోట్ల బడ్జెట్ సినిమా కనుక పెట్టుబడి రాబడిగా మారాలంటే కమర్షియల్ గా రెండు భాగాల ఐడియానే బెటర్ అంటున్నారని తెలుస్తుంది.. కథకు కూడా అంత సీన్ ఉండటంతో రెండు బాగాలుగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.ఆర్ ఆర్ ఆర్ ని పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైనే టైం తీసుకున్న రాజమౌళి మహేశ్ తో 2 భాగాలుగా సినిమా తీయాలంటే కనీసం 4 నుంచి ఐదేళ్లు అయితే పడుతుంది..అప్పటి వరకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పదు.అక్కడే అభిమానులు కంగారుపడే పరిస్థితి ఏర్పడింది.