Mahesh Babu Gives Rs 10 Lakh donation to Telangana from AMB: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. నేడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షల చెక్‌ను మహేష్ బాబు దంపతులు అందించారు. జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. చెక్‌ను అందజేశారు. అంతేకాదు ఏఎంబీ మాల్ తరఫున మరో రూ.10 లక్షలు విరాళంను కూడా సూపర్ స్టార్ అందించారు.
Also Read: Chess Olympiad 2024: రోహిత్ శర్మను అనుకరించిన చెస్ ఛాంపియన్స్.. వీడియో వైరల్!
తెలంగాణకు మరో 10 లక్షల విరాళంను ఇవ్వడంతో మహేష్ బాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘సూపర్ స్టార్‌ది మంచి మనసు’, ‘సాయం చేయడంలో మహేష్ ఎప్పుడూ ముందుంటారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్ న్యూలుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మహేశ్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘SSMB 29’ కోసమే ఈ నయా లుక్ అన్న విషయం తెలిసిందే. ఇక నేడు ఏపీ సీఎం చంద్రబాబును కూడా సూపర్ స్టార్ కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వరద బాధితుల సహాయార్థం సినీ నటుడు మహేశ్ బాబు గారు ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం అందించారు. ముఖ్యమంత్రి @revanth_anumula గారిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసిన @urstrulyMahesh గారు ఈ మేరకు విరాళం చెక్కు అందజేశారు. మహేశ్ గారి వెంట సతీమణి నమ్రత గారు కూడా ఉన్నారు.… pic.twitter.com/5HDJ3V2Jac
— Telangana CMO (@TelanganaCMO) September 23, 2024