Gukesh and Tania Sachdev Celebrations: భారత పురుషుల, మహిళల చెస్ జట్లు సత్తా చాటాయి. చెస్ ఒలింపియాడ్ 2024లో దేశానికి రెండు స్వర్ణాలు అందించాయి. దాంతో చెస్‌కు పుట్టినిల్లు అయిన భారత్‌కు ఉన్న ఏకైక లోటు భర్తీ అయింది. ముందుగా భారత పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తుచేయగా.. అనంతరం అమ్మాయిలు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్‌బైజాన్‌ను ఓడించారు. చెస్ ఒలింపియాడ్‌లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి. 2014, 2022లో పురుషుల జట్లు.. 2022లో మహిళల జట్టు కాంస్యాలు గెలిచాయి.
Also Read: Gold Rate Today: బంగారం ధరకు మళ్లీ రెక్కలు.. 76 వేలు దాటేసిన గోల్డ్ రేట్స్!
గోల్డ్ మెడల్స్ దక్కడంతో చెస్ ప్లేయర్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ క్రమంలో భారత పురుషుల క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మను అనుకరించారు. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో విజయం సాధించిన తర్వాత రోహిత్ రోబో వాక్ చేసుకుంటూ ట్రోఫీని అందుకొన్న సంగతి తెలిసిందే. అప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు అదే రోబో వాక్‌ను చెస్ ప్లేయర్స్ రీక్రియేట్ చేశారు. ఒలింపియాడ్ 2024లో విజేతలుగా నిలిచిన అనంతరం పోడియంపై జాతీయజెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా గుకేశ్, తానియా సచ్‌దేవ్‌లు రోహిత్ స్టైల్‌లో అడుగులు వేస్తూ వచ్చి సంబరాలు చేసుకున్నారు.
INDIA BECAME OLYMPIAD CHAMPIONS FOR THE FIRST TIME EVER. 🇮🇳
– They did “Rohit Sharma walk” while receving the Trophy.pic.twitter.com/rItbI45M8z
— Johns. (@CricCrazyJohns) September 23, 2024