Mahakumbh Mela 2025: దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా మన దేశంలోని సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో అనేక కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. పుణ్యస్నానాలకు మహాకుంభమేళా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇకపోతే, 2025 జనవరిలో జరగబోయే మహాకుంభమేళాకు ఇప్పటి నుంచే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇకపోతే మహా కుంభమేళా కార్యక్రమం ఎక్కడ ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభాన్ని నాలుగు పుణ్యక్షేత్రాలలో నిర్వహిస్తారు. ఇది ప్రయాగ్ రాజ్ లోని సంగం, హరిద్వార్ లోని గంగా నది, ఉజ్జయిని లోని షిప్రా నది, నాసిక్ లోని గోదావరి నది వద్ద జరుగుతుంది.
Also Read: IND vs AUS: ఒంటరిపోరాటం చేస్తున్న ట్రావిస్ హెడ్.. విజయానికి చేరువలో భారత్
మహాకుంభ సమయంలో పవిత్ర నదిలో స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తి అన్ని రకాల వ్యాధులు, పాపాల నుండి విముక్తి పొందుతాడని మత విశ్వాసం. మహాకుంభాలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయానికి వస్తే.. హిందూ క్యాలెండర్ ప్రకారం, మహాకుంభ పౌష్ పూర్ణిమ రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. 2025 సంవత్సరంలో మహాకుంభ మేళ జనవరి 13, 2025 నుండి ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025 న ముగుస్తుంది. అంటే ఈ మహాకుంభ మేళ 45 రోజుల పాటు కొనసాగుతుంది.
Also Read: Stock Market: దూసుకెళ్తున్న మార్కెట్ సూచీలు.. 80 వేలు దాటిన సెన్సెక్స్
మహాకుంభ 2025 తేదీలు:
13 జనవరి 2025-పౌష్ పూర్ణిమ స్నాన్
14 జనవరి 2025 – మకర సంక్రాంతి స్నానాలు
29 జనవరి 2025 – మౌని అమావాస్య స్నానం
03 ఫిబ్రవరి 2025 – వసంత పంచమి స్నానము
12 ఫిబ్రవరి 2025 – మాఘీ పూర్ణిమ స్నానము
26 ఫిబ్రవరి 2025 – మహాశివరాత్రి స్నానము.