Earthquake: ఇండోనేషియాలో మరోసారి భారీ భూ కంపం సంభవించింది. జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) శుక్రవారం ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:55 గంటలకు బలమైన భూకంపం సంభవించిందని పేర్కొంది.
Read Also: Congress Leader: మున్సిపల్ సీటు కోసం 45 గంటల్లోనే వధువును పట్టిన కాంగ్రెస్ నేత
భూకంప కేంద్రం 594 కిలోమీటర్ల (370 మైళ్లు) లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ సునామీ హెచ్చరికలను తోసిపుచ్చింది.ఈ భూకంపం కారణంగా ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.