అరుణాచల్ ప్రదేశ్‌లోని దిబాంగ్ లోయలో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం భూకంపం గురించి నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ సమాచారం ఇచ్చింది. జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, ఉదయం 5:06 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా అరుణాచల్ ప్రదేశ్‌లో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంభవించ లేదు. భూకంపం కారణంగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. తీవ్రత తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పనట్లైంది. Also Read:Nara…
Indonesia Earthquake: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఈ భూకంపం 80 కి.మీ లోతులో సంభవించిందని ఎన్‌సీఎస్ పేర్కొంది. ఈ భూకంపం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు వస్తాయన్న విషయం తెలిసిందే. Also Read: INDW vs AUSW: నేడే భారత్,…
Earthquake: వరసగా భారీ భూకంపాలతో ద్వీపదేశం ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి శక్తివంతమైన భూకంపం వచ్చింది. 6.7 తీవ్రతతో బండా సముద్రంలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన వివరాలు తెలియలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
Indonesia: ఇండోనేషియాలోని తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ ఈ సమాచారాన్ని ఇచ్చింది.
ఇండోనేషియాలో మరోసారి భారీ భూ కంపం సంభవించింది. జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) శుక్రవారం ప్రకటించింది.
Toll From Indonesia Earthquake Reaches 252: ఇండోనేషియా భూకంపంలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ భూకంపంలో ఇప్పటి వరకు 252 మంది మరణించారు. మంగళవారం ఇండోనేషియా ప్రభుత్వం మరణాల సంఖ్యను వెల్లడించింది. మరో 31 మంది గల్లంతయ్యారని.. 377 మంది గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం వల్ల 7,060 మంది ప్రజలు చెల్లచెదురయ్యారు.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభంవించింది. ఇండోనేషియాలోని వెస్ట్ జావాలో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి గాయాలయ్యాయి.