LSG vs MI: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేడు (శుక్రవారం) భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్రస్తుత సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో ఓడిపోయింది. లక్నో జట్టుతో జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది. దీని తర్వాత ఆ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. కానీ, మూడో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక మరోవైపు ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ తన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో, రెండో మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. కోల్‌కతాపై ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మోకాలి గాయం కారణంగా లక్నోతో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. శుక్రవారం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అతను గాయపడ్డాడు.
ఇక నేడు జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక నేడు జరిగే మ్యాచ్ లో ప్లేయింగ్ XI జట్టు వివరాలు ఉన్నాయి.
లక్నో సూపర్ జైయింట్స్ (LSG) జట్టు:
మార్ష్, మార్క్రం, పూరన్, పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), బడోని, మిల్లర్, సమద్, ఠాకూర్, దిగ్వేశ్, ఆకాశ్ దీప్, అవేశ్
లక్నో సబ్‌స్టిట్యూట్‌లు:
బిష్ణోయ్, ప్రిన్స్, షాబాజ్, సిద్ధార్థ్, ఆకాశ్
ముంబై ఇండియన్స్ (MI) జట్టు:
జాక్స్, రికెల్టన్ (వికెట్ కీపర్), ధీర్, సూర్యకుమార్, హార్దిక్ (కెప్టెన్), బావా, సాంట్నర్, చహర్, బౌల్ట్, అశ్వనీ, పుత్తూర్
ముంబై సబ్‌స్టిట్యూట్‌లు:
తిలక్, బోష్, మిన్జ్, రాజు, కర్ణ.