Cyclone Montha Effect: మొంథా తుఫాన్ రైతులను నిండా ముంచేసింది. అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంట దెబ్బతినింది.
CM Chandrababu: ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురు గాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు..
ఏపీ రైతులకు శుభవార్త.. అతి త్వరలోనే..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలో పంట సాగు ముమ్మరంగా సాగుతున్న వేళ యూరియా కొరత నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంది. కేంద్ర రసాయనాలు అండ్ ఎరువుల శాఖ మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రైతులకు యూరియా అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియాను విశాఖపట్నంలోని గంగవరం పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ చేసింది. యూరియా…
Srisailam Dam : గత 20 రోజులుగా మహారాష్ట్రలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో నదుల్లో భారీ వరద ఉధృతి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. పూర్తి వర్షాకాలం రాకముందే ఈ సీజన్‌లో రెండోసారి జూరాల డ్యామ్ గేట్లను అధికారులు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఈ వరద నీరు నేరుగా కృష్ణా నదిలోకి చేరి శ్రీశైలం జలాశయాన్ని చేరుతోంది. Surya :…
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఈరోజు తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత రెండు రోజుల్లో శ్రీలంక తీరాన్ని దాటుకుని తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు'ఫెంగల్'గా నామకరణం చేశారు.
ఏపీని వర్షాలు వీడటం లేదు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 2 రోజుల్లో ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పార్వతీపురం మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి కోనసీమ, ఎన్టీఆర్ తూర్పు, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అయితే.. అల్పపీడనం ప్రభావం వల్ల…
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లో విధ్వంసం కొనసాగుతోంది, రెండు రాష్ట్రాల్లో కనీసం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. కురుస్తున్న వర్షం మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది, రైలు ట్రాక్‌లు, రోడ్లు , విస్తారమైన వ్యవసాయ భూములను వరదలు ముంచెత్తాయి, దీని ఫలితంగా రైళ్ల రద్దు , మళ్లింపు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా రోజువారీ జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడి పంటలకు నష్టం వాటిల్లింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఏజెన్సీలు…