PM Modi: 14న మోడీ నామినేషన్.. హాజరుకానున్న ఎన్డీఏ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో చివరి విడతలో.. అనగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు బీజేపీ అధిష్టానం ఆహ్వానం పంపింది. ఏపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం వారణాసి చేరుకుని.. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: “అతను ఎలాగైనా చావాల్సిందే”.. గ్యాంగ్‌స్టర్ అన్సారీ మరణంపై సీఎం యోగి కామెంట్స్..
Also Read
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
మరోవైపు ప్రధాని మోడీ నామినేషన్ వేసేందుకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ ఏర్పాట్లను హోంశాఖ మంత్రి అమిత్‌షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత సునీల్ బన్సల్ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. నామినేషన్ అనంతరం ప్రధాని మోడీ అక్కడే రెండ్రోజులు ఉండి ప్రచారం నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో స్వేచ్ఛ కోసం పోరాటం.. భారీగా నిరసనలు..
ప్రధాన మోడీ గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. తీరిక లేకుండా అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. 400 సీట్లే లక్ష్యంగా ప్రధాని మోడీ ప్రచారం చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికేమూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత సోమవారం జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Amit Shah: పాక్ వద్ద అణుబాంబులు ఉంటే పీఓకేని వదిలేయాలా..? కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..
తాజావార్తలు
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!