Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 28న బండా జైలులో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మరణించడంపై ఆయన వ్యాఖ్యానించారు. నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘అతను ఎలాగైనా చనిపోవాలి’ అని అన్నారు. అన్సారీ మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. జైలులో అతనికి పాయిజన్ ఇచ్చి చంపారని అతని కొడుకుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో మాత్రం అతను గుండెపోటుతో మరణించినట్లు తేలింది.
Read Also: Tamil Nadu: మహిళను చంపి, గొయ్యి తవ్వుతుండగా రెండ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నిందితులు..
గ్యాంగ్ స్టర్ మరణానికి సంబంధించిన ప్రశ్నపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ, అతను ఎలాగైనా చనిపోవాల్సిందే, మీరే చెప్పండి, వందలాది మందిని చంపిన వ్యక్తి ఎంతకాలం తప్పించుకుంటాడు..? అని అన్నారు. అన్సారీ మరణంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తిన తరుణంలో ఆ పార్టీపై యోగి ఫైర్ అయ్యారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ నేతలు అతడిని రక్షించేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఆయన రక్షకులు, ప్రతిపక్షాల నుంచి ఇంకేం ఆశించగలం..?’’ అని అన్నారు.
యూపీ మాజీ సీఎం, రామభక్తుడు కళ్యాణ్ సింగ్ మరణించినప్పుడు సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేయలేదు, కానీ ఓ మాఫియా డాన్ చనిపోతే మొసలి కన్నీరు కారుస్తున్నారని యోగి మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అన్సారీ మార్చి 28న బండా జైలులో గుండెపోటుతో మరణించాడు. అతని మరణం తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఇతర నేతలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
Had to die anyway !
The criminals who have killed hundreds of innocent people and committed mass crimes
(Mukhtar special) pic.twitter.com/s7J4dAbG87
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 11, 2024