కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేరళ చేరుకున్నారు. రాష్ట్ర నాయకులు భారీ స్వాగతం పలికారు. బుధవారం వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ప్రధాని మోడీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో చివరి విడతలో.. అనగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని నామినేషన్ వేయనున్నారు.
ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేశాడు. నిబంధనల ప్రకారం అతడికి సహకరించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
Loksabha Elections 2024 : 2024 లోక్‌సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల నుంచి 102 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు.