Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Unwanted Record: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. వన్డే క్రికెట్లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి కోహ్లీ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. శుక్రవారం మౌంట్ మాంగనూయిలోని బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్ డకౌట్ అవవడంతో ఈ చెత్త రికార్డు నమోదయింది. నాలుగో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు.
మొదటి బ్యాటర్‌గా కోహ్లీ:
వన్డే క్రికెట్లో అత్యధిక డకౌట్లు నమోదు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఇద్దరూ తమ వన్డే కెరీర్లో 20 సార్లు డకౌట్ అయ్యారు. అయితే సచిన్ 463 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును నమోదు చేయగా.. కోహ్లీ కేవలం 321 మ్యాచ్‌ల్లోనే ఈ జాబితాలోకి చేరడం గమనార్హం. ఈ జాబితాలో భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ 19 డకౌట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read
- Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
- IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్‌పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
- Gautam Gambhir: "మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది".. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్‌పై గంభీర్ ఫైర్
- India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
మొత్తంగా జయసూర్య:
టీమిండియా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చెరో 18 డకౌట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. సచిన్ నెలకొల్పిన పలు రికార్డులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న కోహ్లీ.. ఈసారి మాత్రం మాస్టర్ బ్లాస్టర్‌తో ఓ చెత్త రికార్డులో సమంగా నిలిచాడు. వన్డే క్రికెట్ కెరీర్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య ఉన్నాడు. జయసూర్య 433 ఇన్నింగ్స్‌లలో 34 సార్లు డకౌట్ అయ్యాడు.
అత్యధిక డకౌట్ల భారత బ్యాటర్ల లిస్ట్:
సచిన్ టెండూల్కర్ – 20 (463 మ్యాచ్‌లు)
విరాట్ కోహ్లీ – 20 (321 మ్యాచ్‌లు)
జవగల్ శ్రీనాథ్ – 19 (229 మ్యాచ్‌లు)
అనిల్ కుంబ్లే – 18 (295 మ్యాచ్‌లు)
రోహిత్ శర్మ – 18 (269 మ్యాచ్‌లు)
యువరాజ్ సింగ్ – 18 (301 మ్యాచ్‌లు)
తాజావార్తలు
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
-
Vivo T6x 5G: Vivo T6x 5G త్వరలో భారత్‌లో లాంచ్.. BIS సర్టిఫికేషన్‌లో ప్రత్యక్షం.. 50MP కెమెరా, భారీ బ్యాటరీ
-
PM Modi: ప్రధాని మోడీ గొప్ప మనసు.. వృద్ధురాలికి స్వయంగా సాయం
-
Virat Kohli: తనను డకౌట్ చేసిన మాథ్యూ హెన్రీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ.. వీడియో వైరల్..
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!