Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
- హైదరాబాద్‌లో కోటి దీపోత్సవం ప్రారంభం
- శంఖాభిషేకం, కోటి మల్లెల అర్చన
- వైభవంగా ముక్తీశ్వర స్వామి కల్యాణం
- ఆధ్యాత్మికతపై జస్టిస్ సూరేపల్లి నంద సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం ‘కోటి దీపోత్సవం-2026’ శనివారం (నవంబర్ 14) నాడు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కార్తీక శుద్ధ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన మొదటి రోజు వేడుకలకు వేలాదిగా భక్తులు తరలిరావడంతో ప్రాంగణమంతా శివనామస్మరణలతో మార్మోగింది. కైలాసాన్ని తలపించే సభావేదికపై సాగిన విశేష పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి.
అష్టోత్తర శత శంఖాభిషేకం.. భక్తులచే కోటి మల్లెల అర్చన
తొలిరోజు వేడుకల్లో భాగంగా వేదికపై కాశీ స్పటికలింగానికి అష్టోత్తర శత శంఖాభిషేకం, కోటి మల్లెల అర్చన అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదే సమయంలో ప్రాంగణానికి విచ్చేసిన భక్తులందరూ స్వయంగా ఆచరించి తరించేలా శివలింగాలకు ‘కోటి మల్లెల అర్చన’ జరిపించారు. మల్లెపూల సుగంధాల మధ్య, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ భక్తులంతా ఏకకాలంలో చేసిన ఈ విశేష పూజ కనులపండువగా సాగింది.
Also Read
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
- India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
- Nasha Mukt Bharat Yatra : డ్రగ్స్‌పై పోరుకు మెగాస్టార్ మద్దతు.. కిషన్ రెడ్డితో కలిసి కీలక అడుగు
వైభవోపేతంగా కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామి కల్యాణం.. హంస వాహన సేవ.!
మొదటి రోజు వేడుకల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన ‘కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం’ అంగరంగ వైభవంగా జరిగింది. అపమృత్యు దోషాలను హరించే ఆ దివ్య కల్యాణాన్ని కళ్లారా వీక్షించి భక్తులు తరించారు. కల్యాణోత్సవం అనంతరం స్వామివారికి అత్యంత విశిష్టమైన ‘హంస వాహన సేవ’ నిర్వహించారు. హంస వాహనంపై కొలువుదీరిన ఉత్సవమూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.
పీఠాధిపతుల అనుగ్రహ భాషణం.. ప్రవచనామృతం
ఈ మహా యజ్ఞానికి పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి పూజ్యశ్రీ విద్యాశంకరభారతి మహాస్వామీజీ విచ్చేసి భక్తులకు తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని అందించారు. అలాగే ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ నోరి నారాయణ మూర్తి గారి ప్రవచనామృతం భక్తులకు జ్ఞానబోధ చేస్తూ ఆకట్టుకుంది. అనంతరం లక్షలాది దీపపు కాంతుల నడుమ సాగిన మహా నీరాజనం, స్వర్ణలింగోద్భవం, సప్త హారతులతో కోటి దీపోత్సవం తొలిరోజు వేడుకలు అద్భుతంగా ముగిశాయి.
ఆధ్యాత్మిక శక్తితోనే భారత్ మరింత ఉన్నత స్థితికి: జస్టిస్ సూరేపల్లి నంద
ఈ మహా ఆధ్యాత్మిక వేడుకలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఆధ్యాత్మికత ఎంతగానో దోహదపడుతుందని వివరించిన ఆమె, మన సంస్కృతిలో సత్యానికి ఉన్న ప్రాముఖ్యతను, భారతీయులుగా మనం అనుసరించాల్సిన నైతిక విలువలను గుర్తుచేశారు. మనం చేసే పనిని దైవకార్యంగా భావించాలని, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా అంకితభావంతో, నిష్కామ కర్మతో పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజంలో శాంతి, ఐక్యత, తోటివారి పట్ల కరుణ కలిగి ఉండటం కూడా అసలైన ఆధ్యాత్మికతలో భాగమేనని జస్టిస్ నంద పేర్కొన్నారు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారికి తో పాటు వారి కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆధ్యాత్మిక శక్తితోనే భారతదేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.
కోటిదీపోత్సవం-2026 1వ రోజు ఉత్సవంలో భాగంగా పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/rZFiOyEJTD
— BhakthiTV (@BhakthiTVorg) November 14, 2026
కోటిదీపోత్సవం-2026 1వ రోజు ఉత్సవంలో భాగంగా హంసవాహనంపై కాళేశ్వరం ఉత్సవమూర్తుల ఊరేగింపు.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/KZUk7YdC61
— BhakthiTV (@BhakthiTVorg) November 14, 2026
కోటిదీపోత్సవం-2026 1వ రోజు ఉత్సవంలో భాగంగా కాళేశ్వరం శ్రీ ముక్తేశ్వర స్వామి కల్యాణోత్సవం..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/I1IZpUL5Ld
— BhakthiTV (@BhakthiTVorg) November 14, 2026
పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశంకరభారతిస్వామి @ భక్తి టీవీ కోటిదీపోత్సవం-2026
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/nbn3uXGpeD
— BhakthiTV (@BhakthiTVorg) November 14, 2026
కోటి దీపోత్సవం మొదటి రోజు ఉత్సవంలో భాగంగా వేదిక పై కాశీ స్ఫటిక లింగానికి 108 శంభాభిషేకం – కోటిమల్లెల అర్చన..
#NoriNarayanaMurthy #BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/TKM1SeO52P
— BhakthiTV (@BhakthiTVorg) November 14, 2026
Pics Of #Rangoli & floral decorations @ #BhakthiTV #KarthikaDeepotsavam2026 Day-1
#BhakthiTV #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/elgMyLpjUx
— BhakthiTV (@BhakthiTVorg) November 14, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!