ప్రధాని మోడీ మే 14న వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో చివరి విడతలో.. అనగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం మంగళవారం ప్రధాని నామినేషన్ వేయనున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మే 14 వరకు న్యాయస్థానం కస్టడీ పొడిగించింది. ఇదిలా ఉంటే లిక్కర్ పాలసీ కేసులో వారంలో కవితపై ఈడీ ఛార్జ్‌షీటు దాఖలు చేయనుంది.