యూపీలోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలు ప్రమాదం కేసులో పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు పేలుడు శబ్ధం తనకు వినిపించిందని రైలు లోకో పైలట్ తెలిపారు.
యూపీలోని గోండాలో గురువారం మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్ నుంచి గోరఖ్‌పూర్ మీదుగా అస్సాం వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి.