అమెరికా నేవీకి నూతన అధిపతిగా లీసా ఫ్రాంచెట్టి పేరు తెరపైకి వచ్చింది. దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆ పేరును ప్రతిపాదించారు. ఒకవేళ యూఎస్ సెనేట్ ఆ ప్రతిపాదనను సమర్ధిస్తే అడ్మిరల్ లీసా ఫ్రాంచెట్టి అమెరికా నావికా దళాధిపతిగా బాధ్యతలు స్వీకరించనుంది.
అనుమానిత ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ హుస్సన్ అల్ ఖురాషి సిరియాలో చనిపోయినట్లు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రకటించారు. టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ ఇంటిలిజెన్స్ నిర్వహించిన ఆరపరేషన్ లో హతమయ్యినట్లు పేర్కొన్నారు.