Godavari Flood: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది.. గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం పెరుగుతుంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 12.5 అడుగులకు చేరుకుంది. బ్యారేజ్ 175 గేట్లను ఎత్తివేసి 10 లక్షల 80 వేల 223 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద బ్యారేజీ వద్ద గోదావరి వరద మరింత పెరగనుంది. బ్యారేజీ మొదటి ప్రమాద హెచ్చరికను మించి వరద ప్రవాహం కొనసాగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవాహిస్తున్నాయి. కోనసీమ జిల్లాలో గౌతమి, వశిష్ట, వైనతేయ ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
Read Also: Liver Disease: రాత్రి అకస్మాత్తుగా మేల్కొంటున్నారా? ఇది ప్రమాదకరమైన వ్యాధికి సంకేతం కావచ్చు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వాగులు ఉప్పొంగుతున్నాయి. తమ్మిలేరులో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. తమ్మిలేరు జలాశయానికి 2వేల 890 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా.. ప్రస్తుతం 343 అడుగులకు చేరింది.. వర్షాలు మరింత పెరిగితే దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. భారీ వర్షాలతో ఇప్పటికే తమ్మిలేరు ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల గట్లు కోతకి గురి కావడంతో ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో అనే భయంలో ఉన్నారు. ఇక, కోనసీమలో గౌతమి, వశిష్ట, వైనతేయ పాయలు ఉప్పొంగడంతో.. జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి లంక గ్రామాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఉధృతంగా శబరి గోదావరి నదులు ప్రవహిస్తుండగా.. కూనవరం వద్ద ప్రమాదకర స్థాయిలో శబరి బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది శబరి నది.. కూనవరం మండలం పొలిపాక వద్ద రహదారిపైకి వరద నీరు చేరడంతో.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది.. చింతూరులో 38 అడుగుల వద్ద ఉధృతంగా శబరి నది ప్రవహిస్తుండగా.. కూనవరం వద్ద 47 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం.. ఇక, వీఆర్ పురం, చింతూరు మండలాల మధ్య రాకపోకలు తెగిపోయాయి.