బీజేపీ లేక ముందే రాముడు ఉన్నాడని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను బీజేపీ మింగేస్తుందని ఆరోపించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు. ఇవాళ ఆయన ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. దొంగలకు వ్యతిరేకంగా మా పార్టీ పోరాటం చేస్తోందని, ఎర్రజెండాలు శ్రామికులకు, పేదలకు వెలుగులు ప్రసారింపజేస్తాయన్నారు. కమ్యూనిస్టు లను కొంతమంది ఆ కమ్యూనిస్టు లు వేరు ఈ కమ్యూనిస్టు లు వేరు అని విమర్శించారని, ఆయన అప్పుడు ఏ పార్టీ ఇప్పుడు ఏ పార్టీ అని ప్రశ్నించారు.
Also Read : Deepika Misra: శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్
కమ్యూనిస్టు పార్టీలను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం వారి భరతం పడతామని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ వెళ్లి మేస్తా అనే వాళ్ళు కమ్యూనిస్టు లను విమర్శిస్తున్నారు. సీపీఐ పార్టీ 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ . ఎర్ర జెండాను మనకు మనమే నిర్వీర్యం చేసుకున్నాం. బీఆర్‌ఎస్‌లో ఉన్న వాళ్ళు అంతకుముందు ఏపార్టీ లో ఉన్నారు. పార్టీలు మారే సంస్కృతి మాకు లేదు. జనసేన పార్టీకి కు పక్షవాతం వచ్చింది. అధికారం ఉన్న లేకపోయినా జగన్నాథ రథ చక్రాలు లాగా నడుస్తూనే ఉంటాం. అడ్డొస్తే చక్రాల కింద పడి నలిగి పోతారు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : SRH vs CSK: చితక్కొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది