SRH vs CSK: చితక్కొడుతున్న చెన్నై సూపర్ కింగ్స్.. 10 ఓవర్లలో స్కోరు ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai Super Kings Scored 86 In First 10 Overs: సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా తొలి 10 ఓవర్లలో 86 పరుగులు చేసింది. చెన్నై విజయం సాధించాలంటే.. మరో 10 ఓవర్లలో 49 స్కోరు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం చిన్నదే కావడంతో.. చెన్నై ఓపెనర్లు హడావుడిగా ఆడట్లేదు. ఆచితూచి ఆడుతూ.. అనుకూలమైన బంతులు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా.. పవర్ ప్లేలో అదరగొట్టేశారు. ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసే సమయానికి 61 పరుగులు చేశారు. ఇక పవర్ ప్లే ముగిసినప్పటి నుంచి అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా.. జాగ్రత్తగా రాణిస్తున్నారు.
Pawan Kalyan: ముద్దుల మేనల్లుడును కూడా అలా పిలవాలా.. పవన్
Also Read
- Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..

ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే తన అర్థశతకం పూర్తి చేసుకున్నాడు. 33 బంతుల్లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్ సహకారంతో 50 పరుగులు చేశాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతున్న ఇతను.. పవర్ ప్లే అనంతరం కాస్త నెమ్మదించాడు. ఏ పిచ్‌లో అయితే సన్‌రైజర్స్ బ్యాటర్లు స్కోరు చేసేందుకు తంటాలు పడ్డారో, అదే పిచ్‌లో చెన్నై ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అటు.. రుతురాజ్ గైక్వాడ్ నిదానంగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 26 బంతుల్లో రెండు ఫోర్ల సహకారంతో 34 పరుగులు చేశాడు. వీళ్లిద్దరు ఆటతీరు చూస్తుంటే.. ఓపెనర్లే లక్ష్యాన్ని ఛేధించేలా కనిపిస్తున్నారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లకు వికెట్ తీసేందుకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వడం లేదు. వికెట్ల లోపలికి దూసుకెళ్తున్న బంతుల్ని అడ్డుకుంటున్న ఈ ఆటగాళ్లు.. షాట్ బంతులకు టెంప్ట్ అవ్వకుండా, చాలా చక్కగా ఆడుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!