తెలంగాణ రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ లో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు మహిళా పారిశ్రామిక వేత్తలను ఎంకరేజ్ చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. జపాన్ లో న్యూక్లీయర్ దాడి జరిగినా.. దానిని తట్టుకునే శక్తి ఆ దేశానికి ఉందని ఆయన అన్నారు. కానీ మన దేశంలో సహజ వనరులు ఉపయోగించుకొకపోవడం వల్ల ఇంకా వెనుక బడి ఉన్నామని కేటీఆర్ వెల్లడించారు.
Also Read : Bopparaju Venkateswarlu: ఆదివారం తుది ఉద్యమ కార్యాచరణ ప్రకటన.. చర్చలకు విలువ లేదు..?
ప్రపంచంలో నే అతి పెద్ద దేశం అయిన ఇండియా.. ప్రపంచానికి ఏమి ఇవ్వలేదు.. వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ లు తయారు చేసే దానిలో మహిళా పారిశ్రామిక వేత్తలు ముందుండాలి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే ప్రొడక్ట్ లు మహిళలు తయారు చేయాలి అని ఆయన వెల్లడించారు. తెలంగాణ లో 15 వేల కోట్ల రూపాయల వరకు మహిళా గ్రూప్ లకు వడ్డీలు లేకుండా రుణాలు ఇస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణ లో 20 లక్షల ఎకరాల్లో వంట నూనెలు పండించాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు.
Also Read : BRS MLA’s Press Meet : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి మెదడు లేదు..
ఐదు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసురాబోతున్నాట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో నే తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలపబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరం లో 35 ఫ్లై ఓవర్ లు కట్టినం… అయినా ట్రాఫిక్ తగ్గట్లేదు.. అందుకే మెట్రోరైలును విస్తరిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. టెక్స్ టైల్ శాఖ పైన సమీక్ష సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు. నేతన్నల సంక్షేమం అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
Also Read : Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
నేతన్నల ఆదాయం, వృత్తి నైపుణ్యం పెంచడం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై నివేదిక రూపొందించాలని టెక్స్ టైల్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని టెక్స్ టైల్ పార్కులు, చేనేత క్లస్టర్ల అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లో చేనేత మ్యూజీయం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని అదేశించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి అని చెప్పారు. తమిళనాడులోని తిర్పూర్ మాదిరిగా తెలంగాణలో పవర్లూమ్ క్లస్టర్ల అభివృద్ధికి అధ్యయనం చేయాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు.