Deputy CM Pawan Kalyan: మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికీ, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు నిత్యావసరాలను ఉచితంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం నిర్దేశించిన విధంగా అధికార యంత్రాంగం నిత్యావసరాలను సమకూర్చిందని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు.
చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయిన చేనేతను సర్కారు ఆదరించింది. ‘చేనేత వృత్తిపై ఆధారపడిన నేతన్నలకు కాంగ్రెస్ సర్కారు అండగా ఉంటుంది. నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటాం. రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నలకు కూడా మాఫీ చేస్తాం. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాం’ గతేడాది సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో ఐఐహెచ్‌టీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన…
చేనేత కార్మికులకు మంత్రి గుడ్‌న్యూస్ చెప్పారు. చేనేతల రుణాలు వచ్చే బడ్జెట్ లో మాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. "మీకు నష్టం జరిగే ఏ పని చేయదు. నేతన్నలకు సాయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కుల గణన విషయంలో రేవంత్ రెడ్డిని చాలా మంది వ్యతిరేకించారు. కానీ రాహుల్ గాంధీ మాట నిలబెట్టేందుకు కుల…
Tummala Nageswara Rao :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వర్కర్ టూ ఓనర్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్‌లో సమావేశమై పథకం అమలుపై చర్చించారు. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు.…
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు చేనేత శాఖ సంక్షేమ మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు జగన్ పాలనలో చేనేత కళాకారులు ఎన్నో బాధలు అనుభవించారన్నారు. చేనేత కళాకారుల కలలు మరుగున పడ్డాయని తెలిపారు.
మంగళగిరితో ముడిపడిన బంధం నన్ను చేనేత కుటుంబ సభ్యుడిని చేసిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర మంత్రి జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మంత్రి తెలిపారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషమని.. వస్త్ర పరిశ్రమ ఆసాములు, నేతన్నలంతా ఐక్యంగా చేసిన పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు నేతన్నల డిమాండ్లన్నీ పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.