KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్ , జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది.
Top Headlines @5PM : టాప్ న్యూస్
ఈ వివాదానికి నేపథ్యం ఇది – ఇటీవల కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 25 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డదని తీవ్రంగా ఆరోపించారు. ముఖ్యంగా మూసి నది ప్రక్షాళన ప్రాజెక్ట్‌ను కేంద్రంగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఉట్నూరులో కేటీఆర్‌పై కేసు నమోదైంది.
తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ కేసులో కేటీఆర్‌కు అనుకూలంగా తీర్పు చెప్పి, ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ కేసు మళ్లీ న్యాయపరంగా కీలక మలుపు తిరిగింది. సుప్రీం విచారణతో రాజకీయంగా ఈ అంశం మరింత దుమారం రేపే అవకాశాలు ఉన్నాయి.
India-Pakistan: సింధు జలాల ఒప్పందంపై పాక్ లేఖ.. భారత్ రియాక్షన్..?