తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పుకొచ్చాడు.
ప్రతీ సంవత్సరం ప్రోగ్రెస్ రిపోర్ట్ ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నాము అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తొమ్మిది సంవత్సరాల రిపోర్ట్ ను విడుదల చేశాము అని ఆయన పేర్కొన్నారు. ఇది సమగ్రమైన నివేదిక.. హైదరాబాద్, తెలంగాణలోని మున్సిపాలిటిలు బాగా పని చేస్తున్నాయి అనడానికి మాకు కేంద్రం నుంచి వచ్చిన అవార్డులే నిదర్శనం అని కేటీఆర్ అన్నారు.