కొంత మంది నటినటులు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. వారి ఫేమ్, ప్రేక్షకుల్లో వారి పై అభిమానం ఎక్కడ తగ్గదు. అలాంటి వారిలో సినీ నటి హేమ ఒకరు. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు, తిరుగులేని స్థాయి, స్థానం సంపాదించుకుంది. ఒక్కప్పుడు ప్రతి ఒక మూవీలో ఆమె పాత్ర కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాంటిది ఈ మధ్య ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ షాపింగ్ మాల్ ఒపెన్నింగ్‌కి వచ్చిన హేమ తను ఓ షాకింగ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలిపింది..
Also Read: Sreeleela: రష్మిక తో మాట్లాడటానికి ఇబ్బంది పడ్డా..
‘అతడు’ మూవీలో బ్రహ్మానందం, హేమ కాంబినేషన్‌లో వచ్చే సీన్‌లు ఎంత హైలెట్ అయ్యాయి మనకు తెలిసిందే. అందుకే నటి హేమ ఎన్ని సినిమాలు చేసినా అతడు సినిమా గురించే అడుగుతుంటారు. మరి అలాంటి పాత్రలు ఎప్పుడు చేస్తారు.. అని తాజాగా షాపింగ్ మాల్ ఒపెన్నింగ్‌కి వచ్చిన హేమను అడిగితే.. అలాంటి పాత్రలు కాదు.. అసలు ఇకపై ఎలాంటి పాత్రలు చేయనని ట్విస్ట్ ఇచ్చింది.. హేమా మాట్లాడుతూ ‘ నేను యాక్ట్ చేయడం మానేశాను. నాకు 14 ఏళ్ల వయసు అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఇక చాలు. ఇంకెంతకాలం కష్టపడాలి? ఎవరికోసం కష్టపడాలి? నేను నా కోసం హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటూ చిల్ అవుతూ, చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు బోర్ కొట్టి మళ్లీ యాక్ట్ చేయాలని అనిపించినప్పుడు చేస్తాను. ప్రజెంట్ అయితే శివగామి లాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయను’ అని చెప్పుకొచ్చింది హేమ.