Central Govt To Give Bharata Ratna for NTR Today: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మార్చి 15న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ టర్మ్‌కు ఇదే చివరి కేబినెట్ కావడంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు భారతరత్న ఇచ్చే అంశంపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
Also Read: Telangana Student: అమెరికాలో జెట్‌స్కీ ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి!
సినీ రంగంలో మాత్రమే కాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ప్రకటించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ అంశంపై కేంద్రానికి ఇప్పటికే చాలా విజ్ఞప్తులు అందాయి. సామాన్య ప్రజలతో పాటు పలువురు రాజకీయ నాయకులు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. దీంతో మోడీ అధ్యక్షతన జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.