Lucky Baskhar : వెంకీ అట్లూరి దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ సెల్మాన్ నటించిన సీతారామం సినిమా తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో అయేషా ఖాన్ అనే మరో బ్యూటీ కూడా నటిస్తోంది. ఈ సినిమా మేకర్స్ ఇప్పటికే సంగీతాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించారు.
TTD Temple: టోకెన్ స్కాన్నింగ్ పునఃప్రారంభించనున్న టీటీడీ(వీడియో)
ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేయగానే అందుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తి పాటను జూన్ 19, 2024 నేడు విడుదల చేసారు. ‘శ్రీమతి గారు’ అనే పాటను తాజాగా విడుదల చేసారు. మెలోడీగా సాగే ఈపాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో లిరిక్స్ కూడా ప్రతి జంటకు హత్తుకునేలా రచించారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, హిందీ, తమిళంలో విడుదల చేయనున్నామని సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జైవీ ప్రకాష్ కుమార్ సంగీతం బాణీలు అందించారు.
Darshan: నటుడు దర్శన్‌కి మరో టెన్షన్.. ఇంటిని కూల్చేసే యోచనలో సర్కార్?