పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కాకరేపుతున్నాయి. గతంలో ఎన్నోసార్లు పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన ఆయన.. ఈసారి బీజేపీ మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విషయంలో సానుకూలంగా మాట్లాడారు. అసలు ఏమైందంటే.. ఓ పెళ్లి వేడుకలో ఈటల రాజేందర్, మల్లారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ఈటలను ఆలింగనం చేసుకుని..” నివ్వే గెలుస్తావ్ అన్న” అని వ్యాఖ్యానించారు. ఫోటో తీయ్యి మా అన్నతోటి అంటు ఈటలతో ఫోటో దిగారు మల్లారెడ్డి. నువ్వు ఎక్కడో.. నేను ఎక్కడో.. మళ్లీ ఎప్పుడు కలుస్తామో.. ఏమో అంటు చేతిలో చెయ్యి వేసి మాట్లాడిన ఆయన అక్కడి నుంచి వెళ్లి పోయారు.
READ MORE: Priyanka Chopra: అమెరికా చెక్కేసిన ప్రియాంకకి ఇక్కడ ఎన్ని లక్షలు అద్దెలు వస్తాయో తెలుసా?
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన బీఆర్ఎస్ నాయకులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఊపు తగ్గిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలతో మొదటి సారిగా తెలంగాణ భవన్లో నిర్వహించి మీటింగ్ కి మల్లరెడ్డి హాజరు కాలేదు. దీంతో పార్టీ మారుతున్నడన్న పుకార్లు వెలుడ్డాయి. ఇటీవల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రెడ్డిని సైతం కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారని వదంతులు వచ్చాయి. ఈ పుకార్లపై స్పందించిన మల్లారెడ్డి.. వ్యాపార విషయాలు మాట్లాడటానికి మాత్రమే కలిశానని.. అది కూడా ఓ మధ్యవర్తి ద్వారా మీట్ అయినట్లు స్పష్టం చేశారు. పార్టీ మారే అవకాశమే లేదని.. బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని తెలిపారు.
మరోపైపు మల్కాజ్గిరి పార్లమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి ని ఎలాగైనా గెలిపించుకోవాలని కాంగ్రెస్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తనకు ఆ నియోజకవర్గంలో పట్టుందని.. తప్పకుండా గెలుస్తానని చెప్పి సీటు తెచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అతను ఇక్కడ ఎలాగైనా.. గెలవాలని కంకణం కట్టుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్–నాన్‌లోకల్ మధ్య మల్కాజ్‌గిరిలో ఎన్నికల పోరు ఉండబోతుందని జనంలోకి వెళ్తున్నారు.