Kadiyam Srihari : కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల కోసం రూ.800 కోట్లు మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. తన విజయానికి ప్రజల ఆదరాభిమానాలే కారణమని, ప్రతిపక్షంలో అభివృద్ధి కష్టమని గ్రహించి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల కింద 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, ఇంకా పెంచాలని సీఎం ప్రత్యేక నిధుల నుంచి మరిన్ని ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. గత 15 ఏళ్లలో అభివృద్ధి జరగలేదని,…
స్వదేశంలో చైనాను ఓడించి.. ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య చైనా, భారత్ మధ్య జరిగింది. భారత జట్టు ఆరోసారి ఫైనల్ ఆడుతుండగా, చైనాకు ఇది తొలి ఫైనల్. చైనా జట్టు తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నించి టీమ్‌ఇండియాకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత హాకీ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్‌ను కైవసం…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫార్మసీ విభాగాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ గార్లతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు MGM ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓ రోగి బంధువు తనకు మందులు ఇవ్వడం లేదన్న విషయాన్ని మంత్రులు, ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు…
మడికొండ సత్య సాయి కన్వెన్షన్ హాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య పరిచయ, ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది.
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, అతడి కుమార్తె వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్యపై తీవ్ర విమర్శలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి తాను ఒక్కడే తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటారని.. అది పచ్చి అబద్ధమన్న విషయం ప్రజలందరికీ తెలుసని కోదండ రామ్ అన్నారు. కాజిపేట్, మడికొండలో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. కడియం కావ్యకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను వెల్లడించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.