పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇక మిగిలింది ఇద్దరే ఇద్దరు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ల విచారణ పూర్తి చేస్తే ఇక ఖేల్ ఖతం. ఈ ఇద్దరి విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8మంది ఎమ్మెల్యేలపై విచారణ చేసి…తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్….మరి కడియం, దానంలపై ఎలా వ్యవహరించబోతున్నారు..? ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్దులుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం…
Off The Record: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొలిక్కి వచ్చిందా..? ఇక నాన్చొద్దు... వాళ్ళ సంగతి తేల్చేయాల్సిందేనని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గట్టిగా డిసైడ్ అయ్యారా..? వేటుపడేది ఎవరి మీద?
బీఆర్ఎస్ నేతలపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత ప్రభుత్వంలో 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని, అందులో ఇద్దరిని మంత్రులను కూడా చేశారని గుర్తు చేశారు. అప్పటి వారెవరూ రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని విమర్శించారు. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారని, ఈ బుద్ది అప్పుడు ఏమైంది?…
Errabelli Dayakar Rao : హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపురం గ్రామం నుండి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రైతుల కోసం పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాపురం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర నష్కల్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారు. Bollywood…
ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ఎత్తిపోతల పథకం ఒక వరప్రదాయమని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
దేశ మంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.. ఈ అంశంపై పార్టీ మారిన స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
Konda Surekha: ఉమ్మడి వరంగల్‌లోని కాంగ్రెస్ కీలక నేతలపై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేసింది. ఈరోజు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ లో చేస్తూ.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి అని ఆరోపించింది. నేను మంత్రిగా ఉంటే నా ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీల్ అవుతున్నాడని పేర్కొనింది.
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దగ్గర భజనపరుల సంఖ్య పెరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరిని చూస్తే సొంత పార్టీ నేతలే భయపడుతున్నారని విమర్శించారు. కడియం పని చేయాలంటే కమిట్మెంట్ కావాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో కడియం అనుచరులు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో 1994-2004 నాటి కడియం నిరంకుశ పాలన మళ్లీ ప్రారంభమైందని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘన్పూర్ మీడియా సమావేశంలో…
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. పల్లా రాజేశ్వర్ రెడ్డి నాపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్లో నా పలుకుబడి గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుండు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నాను.. పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలి అంటున్నాడు.. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది, సుప్రీం కోర్టు…
Thatikonda Rajaiah : స్టేషన్ ఘన్పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికపై ఈ స్థాయి వ్యక్తిగత వ్యాఖ్యలు కావడం హాట్ టాపిక్‌గా మారింది. తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ”…