2024 ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎన్నిసీట్లు వస్తాయో జోస్యం చెప్పారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో కొండాలమ్మ దేవస్థానం ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలో పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న కొండాలమ్మ దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని త్వరలోనే పేద ప్రజలకు ఉపయోగపడే కల్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వం నుండి నిధులు వచ్చేందుకు ప్రయత్నిస్తానని శాసనసభ్యులు కొడాలి నాని తెలియజేశారు. 2024 ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ 151 సీట్లకు పైనే విజయం సాధిస్తుందన్నారు. అన్ని పార్టీలు కలిసి వచ్చిన కేవలం 18 స్థానాల్లో మాత్రమే పోటాపోటీ పోరు జరుగుతుందని… మిగతా స్థానాలలో ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలవడం జరుగుతుందని తెలిపారు.
Read Also: Nitin Gadkari: దేశంలోనే ఏపీ సమ్ థింగ్ స్పెషల్
విశాఖలో పెట్టుబడిదారులతో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఏ విధమైన రాయితీలు అందించడం జరుగుతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి వ్యాపారవేత్తలకు వివరించడం జరుగుతుంన్నారు. ఈ గ్లోబల్ సమ్మిట్ తర్వాత రాష్ట్రంలో భారీగా వ్యాపార సంస్థలు ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందని కొడాలి నాని అన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పేదవాడి ఆర్థిక బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనని సంక్షేమ పథకాలను పేదవారి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయడమంటే రోడ్లు వేయటం నిర్మాణాలు కట్టడమే కాదు ప్రతి పేదవాడిని ఆర్థికంగా బోలోపేతం చేయడం కూడా అభివృద్ధిలో భాగమేనని కొడాలి నాని స్పష్టం చేశారు.
హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం. తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారు . కానీ అక్కడ డబ్బున్నోళ్లను ఒకలా..లేనోళ్లను ఒకలా చూస్తున్నారు . తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసినా జగన్ మోహన్ రెడ్డి అన్నింటికీ తెగించారు.పేదల తరపున పోరాటం చేస్తున్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. చైతన్య, నారాయణ వంటి సంస్థలతో జగన్ మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నారు అన్నారు నాని.
Read Also: I Love Manish Sisodia: జైలుకు వెళ్లిన సిసోడియాకు పిల్లలతో మద్దతు.. ఆప్‌పై బీజేపీ ఆరోపణలు