స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌లో నాగార్జున అక్కినేని హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. మూడు నెలల పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన ఈ రియాలిటీ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలే దశలో ఉత్కంఠను రేపుతోంది. ఎవరు ట్రోఫీ గెలుస్తారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో ‘ముద్ద మందారం’ వంటి టీవీ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన 33 ఏళ్ల బెంగళూరు నటి తనుజ పుట్టస్వామి టాప్ 5 ఫైనలిస్టుల్లో చోటు దక్కించుకోవడం విశేషం. కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్, సంజన గల్రానీ తో పాటు తనుజ కూడా బిగ్‌బాస్ 9 టైటిల్ రేస్‌లో నిలిచింది.
Also Read : Kirtan Nadagoud : కన్నీరు పెట్టిస్తున్న దుర్ఘటన.. లిఫ్ట్ ప్రమాదంలో దర్శకుడి తనయుడి
బిగ్‌బాస్ హౌస్‌లో తనుజ చూపించిన నిజాయితీ, సింప్లిసిటీ, స్పష్టమైన అభిప్రాయాలు ఆమెకు పెద్ద ప్లస్‌గా మారాయి. ఎలాంటి సానుభూతి వ్యూహాలు, డ్రామాలు లేకుండా తన ఆటను తాను ఆడిన విధానం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా, తాను గెలిచే ప్రైజ్ మనీని పేద విద్యార్థుల చదువుల కోసం వినియోగించాలని ఆమె ప్రకటించడం అభిమానులను మరింతగా ఆకట్టుకుంది. ఈ నిర్ణయంతో సోషల్ మీడియాలో ఆమెకు మద్దతు మరింత పెరిగింది.
ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే ఓటింగ్ జోరుగా కొనసాగుతోంది. డిసెంబర్ 14 రాత్రి 10:30 నుంచి ప్రారంభమైన ఓటింగ్‌లో ప్రారంభ ట్రెండ్స్ ప్రకారం కళ్యాణ్ పడాల ముందంజలో ఉన్నప్పటికీ, తనుజకు కూడా భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు రోడ్లెక్కి గ్రాండ్ ర్యాలీలు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ట్రెండ్స్ వేగంగా మారుతుండడం తో చివరి క్షణాల్లో ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. మరి బిగ్‌బాస్ 9 ట్రోఫీ తనుజదేనా? అన్నది ఫినాలే రోజే తేలనుంది.