Union Minister Kishan Reddy Fired on CM KCR
సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. కేసీఆర్ నీతి ఆయోగ్ మీటింగ్ కు రాకపోవటం సరయింది కాదని, దేశాభివృధ్ధి కోసం చర్చించే అద్భుత వేదిక నీతి ఆయోగ్ మీటింగ్ అని ఆయన అన్నారు. మీకు మీటింగ్ కు రావటం ఇష్టం లేక పోతే.. రాకండి.. ప్రధానిని కలవటం మీకు ఇష్టం లేకపోతే ఫార్మ్ హౌస్ లోనో ప్రగతి భవన్ లోనో ఉండండి. కడుపులో నొప్పికి తలనొప్పి అని చెప్తున్నట్లు ఉన్నాయి కేసీఆర్ వాఖ్యలు. బంగారు తెలంగాణ పేరు చెప్పి ఏ రకమైన పరిపాలన చేస్తున్నారు. తెలంగాణ లో బీజేపీ బలపడేంత వరకు కేంద్ర ప్రభుత్వం మంచిది. రాష్ట్రంలో బీజేపీ బలపడ్డాక వాళ్ళ కుటుంబం నుంచి అధికారం కోల్పోతామనే బాధతో, మోడీపై కేంద్ర ప్రభుత్వం పై విషం ప్రచారం చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి ని చేస్తామన్నారు, ఎందుకు చేయలేదు.
ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు. కేంద్రం ఇళ్ల నిర్మాణం కోసం ఓపెన్ ఆఫర్ పెట్టింది. తెలంగాణ లో గులాబీ కండువా కప్పుకున్న వాళ్లకే ఇల్లు ఇస్తున్నారు. కేసీఆర్ గద్దె దిగే వరకు ఆయన హామీలు ప్రజలకు గుర్తు చేస్తాం. 15 మంత్రిత్వ శాఖలు కల్వకుంట్ల గుప్పిట్లో ఉన్నాయి. తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఉందా. పెట్రోల్ డీజిల్ ధరలు తెలంగాలో ఎక్కువ ఉన్నాయి. 37 శాతం పెట్రోల్ మీద, 27 శాతం డీజిల్ మీద పన్ను వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్న. ముఖ్యమంత్రికి గౌరవంగా సీఎం కు లేఖలు రాసాను అని కిషన్ రెడ్డి వివరించారు.