Manchu Lakshmi: మంచు మోహన్ బాబు ముద్దుల తనయగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మంచు లక్ష్మీ ప్రసన్న. నటిగా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలు చేసినా ఆమె ట్రోల్స్ బారిన పడి మరింత ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా అమెరికా ఇంగ్లిష్ మాట్లాడి అందరికి దగ్గరయింది. అభిమానులు అందరు ఆమెను ముద్దుగా మంచు అక్క అని పిలుస్తారు. ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫోజులతో ఫోటోలను షేర్ చేయడమే కాకుండా కొన్నిసార్లు ఇండస్ట్రీ మీద, హీరోయిన్ల మీద కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ.. తెలుగు హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీ పట్టించుకోవడంలేదని, సొంత ప్రొడక్షన్ ఉన్నా తనకు కూడా హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదని ఆమె చెప్పుకోచ్చింది. తాను ఒక హాలీవుడ్ నటి అని, ఇక్కడ ఏదో సాధించాలన్న తాపత్రయంతో వచ్చేసాను.. కానీ, ఇప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చాను అని ఫీల్ అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.
Nandamuri Balakrishna: మనవడితో హాలిడేకు చెక్కేసిన బాలయ్య..
” నేనొక హాలీవుడ్ నటిని. పెళ్లి తరువాత పిల్లలను కావాలి అనుకున్నాను. ఇక్కడ పెంచితే బావుంటుంది అని ఇండియా వచ్చేసాను. అక్కడ ఉంటే నా కెరీర్ వేరేలా ఉండేది. ఇక్కడ తెలుగువారికి దగ్గర అవుదామని వచ్చాను. అయితే ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇక్కడ తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు ఇవ్వరు. నాకు ప్రొడక్షన్ హౌస్ లు ఉన్నాయి. అందులో కూడా హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు. నాకే కాదు.. నిహారిక, శివాత్మిక, బిందు మాధవి, ఈషా రెబ్బ ఇలా .. వారందరికీ ఏం తక్కువ.. ఎందుకు సినిమాలు చేయలేకపోతున్నారు. వారికి ఛాన్స్ లు ఇవ్వకుండా వారి కెరీర్ ను పాడుచేస్తున్నారు. ఇక్కడ వారందరికీ పంజాబీ, గుజరాతీ వాళ్లే కావాలి. తెలుగు అమ్మాయిలు వద్దు.. వాళ్ళను కనుక ప్రోత్సహిస్తే వాళ్లు మంచి పొజిషన్ లో ఉండేవారు. ఇప్పుడు నా కూతరు పెద్దది అయ్యింది.. నేను త్వరలో హాలీవుడ్ కు వెళ్ళిపోతాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.