కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంది. అయితే.. కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. మంత్రి వర్గ నిర్ణయాలు వెల్లడించారు. దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు, 21 రోజుల పాటు జిల్లా,
అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల్లో వేడుకలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు. వృత్తి కులాలకు క్యాబినెట్ సభ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
Also Read : Revanth Reddy : నేను ఓ మెట్టు దిగి వస్తా ఆలోచించండి.. కలిసి పనిచేద్దాం..
అంతేకాకుండా.. ‘ఆర్థిక చేయూత అందించడానికి విధి విధానాలను ఖరారు చేయాలని కమిటీకి బాధ్యత. ఒక్కో లబ్ధిదారునికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించాలని క్యాబినెట్ లో నిర్ణయం. 111 జీవో ను ఎత్తివేస్తూ క్యాబినెట్ లో నిర్ణయం.
HMDA పరిధిలో విధి విధానాలు వర్తిస్తాయో …జీవో 111 పరిధిలోని 84 గ్రామాలకు వర్తింపు. హిమాయత్ ,ఉస్మాన్ సాగర్ కలుషితం కాకుండా చర్యలు. కొండపోచమ్మ నుంచి వీటికి లింక్ చేయాలని నిర్ణయం. హుస్సేన్ సాగర్ కూడా గోదావరి జలాలలో నింపాలని…అందుకు ప్లాన్స్ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ప్రతి జిల్లాకు ఒక DMHO పోస్టు మంజూరు …హైదరాబాద్ జిల్లాకు ఆరు DMHO పోస్టుల మంజూరు. కొత్తగా ఏర్పాటు అయిన 40 మండలాలకు PHC లు మంజూరు. వ్యవసాయ రంగంలో మార్పుల సూచనల కోసం మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. మార్చి నెలాఖరు లోపు కోతలు అయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది. నకిలీ విత్తనాల విక్రయ దారులపై పీడీ యాక్ట్ పెట్టాలని కేసీఅర్ ఆదేశించారని.. దీంతో పాటు.. VRA లను రెగ్యులర్ చేయాలని క్యాబినెట్ నిర్ణయం… విధి విధానాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
Also Read : High Blood Pressure : అధిక రక్తపోటు ఉన్నవారు ఈ వ్యాయామం చేయకూడదు