Uttarpradesh: మహిళా ఎస్సైతో అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు కానిస్టేబుళ్లు.. అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Constables Misbehave With Woman Sub-Inspector in Uttarpradesh and Arrested : ప్రస్తుతం రంగం ఏదైనా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి మారుమూల పని చేసే ప్రాంతాల వరకు ప్రతి చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వారికి ఏదైనా ఆపద వస్తే పోలీసులు అండగా నిలబడతారు. అలాంటిది ఓ మహిళా ఎస్సైతోనే తప్పుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. అయితే వారు ఆమె పై ఆఫీసర్లు కూడా కాదు. ఆమె కింద పనిచేసే కానిస్టేబుళ్లు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలోని చందౌసి ప్రాంతంలో చోటు చేసుకుంది.
Also Read: Haryana : అమానుషం..కుటుంబ సభ్యుల ముందే ముగ్గురు మహిళలపై సామూహిక అత్యాచారం..
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
చందౌసి ప్రాంతంలో సబ్-ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నారు ఓ మహిళ. ఆమె గత బుధవారం విధులు ముగించుకొని తిరిగి వెళుతున్నారు. ఆమెను కారులలో పవన్ చౌదరి, రవీంద్ర అనే ఇద్దరు కానిస్టేబుళ్లు కారులో వెంబడించారు. అనంతరం ఆమెను తిట్టి, అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా చంపేస్తామంటూ పై అధికారినే బెదిరించారు. వీరిపై మహిళ సబ్-ఇన్స్పెక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరి కానిస్టేబుళ్లపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 మరియు 341 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ దీపక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుల్దీప్ సింగ్ గుణవత్ తెలిపారు. మహిళ సబ్-ఇన్స్పెక్టర్ తోనే కింది స్థాయి ఉద్యోగులు ఇలా ప్రవర్తించడం ఆ ప్రాంతంలో చర్చనీయ అంశం అయ్యింది. సొంత డిపార్ట్ మెంట్ లో మహిళ ఉద్యోగులపై ఇలా ప్రవర్తిస్తున్న పోలీసులు తమకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ మహిళ ఎస్సైతో తమకు ఏదో పర్సనల్ గొడవలు ఉండటం వల్లే వారు ఇలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఓ మహిళ పట్ల ఇలా ప్రవర్తించడం సరైన పద్దతి కాదని ప్రతి ఒక్కరు ఆ ఇద్దరు కానిస్టేబుళ్ల చర్యను ఖండిస్తున్నారు. వారిని సస్పెండ్ చేయడంతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!