సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్‌లకు పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందనే సెంటిమెంట్‌కి కీర్తి సురేష్ గట్టి చెక్ పెట్టేసింది. ఎందుకంటే పెళ్లి తర్వాత మరింత స్పీడ్‌గా ప్రాజెక్టులు చేస్తూ ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కీర్తి, తన మనసులో చాలాకాలంగా దాచుకున్న ఒక పెద్ద కలను బయటపెట్టింది. నటన మాత్రమే కాదు, ఇప్పుడు సినిమాల మేకింగ్‌పై కూడా తన ఫోకస్ పెంచింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా’’ అని చెప్పిన మాట ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంటే కీర్తి డైరెక్షన్ వైపు అడుగులు వేస్తుందన్నమాట. కంగనా రనౌత్‌లా నటిస్తూ, డైరెక్ట్ కూడా చేసే ‘లేడీ మెగాఫోన్’ ట్రాక్‌లోకి కీర్తి దిగడానికి సిద్ధమైందని ఫిలింనగర్‌లో చర్చ సాగుతోంది. కానీ..
Also Read : Anupama Parameswaran: వారు నాకు ఎప్పుడు స్పెషలే..
యాక్టింగ్ చేస్తూనే డైరెక్షన్‌ను హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. అజయ్ దేవగన్, కంగనా లాంటి కొద్దిమంది మాత్రమే ఈ బ్యాలెన్స్‌ను ప్రూవ్ చేశారు. ఇప్పుడు కీర్తి కూడా ఆ లిస్టులో చేరేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తుంది. ‘మహానటి’ లో సావిత్రి గారి వంటి గొప్ప నటిగా మెప్పించిన కీర్తి, నిజ జీవితంలో కూడా ఆమెలాగే డైరెక్షన్ వైపు అడుగులు వేయడం యాదృచ్ఛికమైనప్పటికీ చాలా ఆసక్తికరం. ఇక వ్యక్తిగత విషయాల్లో కూడా కీర్తి తన భర్త గురించి ప్రస్తావిస్తూ..
‘‘నా భర్త సినిమాల జోలికి రారు నాతో నటించే ఛాన్స్ లేదు’’ అని నవ్వుతూ చెప్పింది. అంటే ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను ఆమె ఎంత ప్రాక్టికల్‌గా బ్యాలెన్స్ చేస్తోందో అర్థమవుతోంది. దీంతో భర్త సపోర్ట్ ఉన్నా, తన కెరీర్‌ను తనే నిర్మించుకోవాలనే ఆత్మవిశ్వాసం ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు, మహిళల భద్రతపై కీర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచింపజేస్తున్నాయి. తనకూ, సమంతకూ సంబంధించిన ఒక డీప్‌ఫేక్ వీడియో చూసి ఎంత భయపడిపోయానో చెప్పిన ఆమె, ‘‘ఇలాంటి సైబర్ ముప్పుల నుంచి మహిళలను రక్షించేందుకు విదేశాల్లో ఉన్నంత కఠిన చట్టాలు మన దేశంలో కూడా రావాలి’’ అని డిమాండ్ చేసింది.