ఈ ఏడాది డ్రాగన్, కిష్కింధ పురి, ది పెట్ డిటెక్టివ్, బైసన్ లాంటి ఐదుకు పైగా సినిమాలతో బిజీగా గడిపిన అనుపమ పరమేశ్వరన్, తన సహజ నటనతో ఎప్పటిలాగే కుర్రకారుని ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా ఆమె చిత్ర పరిశ్రమలో 10 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన సినీరంగ ప్రవేశం నుంచి ఇప్పటి వరకు జరిగిన మార్పులు, నేర్చుకున్న పాఠాలు గురించి ఓపెన్‌గా చెప్పుకుంది.
Also Read : Varanasi : వారణాసి గ్లింప్స్‌లో కనిపించిన తలలేని దేవత ఎవరో తెలుసా..?
‘‘ఈ పది సంవత్సరాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇంత పెద్ద ప్రయాణం చేశాననే విషయం నాకే నమ్మలేకపోతున్నా. నిన్ననే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. అసలు నేను నటి అవుతానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. మొదట్లో చాలా భయంగా ఉండేది. కానీ ఈ ప్రయాణం నాకే నేను నమ్ముకోవడం, బలంగా నిలబడడం నేర్పింది’’ అని చెప్పిన అనుపమ, 2016లో అఆ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రోజులను గుర్తు చేసుకుంది. తొలి సినిమాలోనే అభిమానులు ఇచ్చిన ప్రేమ మాటల్లో చెప్పలేను, అందుకే తెలుగు ఆడియన్స్ తనకు ఎప్పటికీ స్పెషల్‌గానే ఉంటారని చెప్పింది.
తర్వాత ఇటీవల పెరిగిన “ఫస్ట్ లీడ్, సెకండ్ లీడ్” అనే పదాల గురించి మాట్లాడిన ఆమె, ‘‘ఇవి ఇప్పుడేమో అంత అవసరం లేని ట్యాగ్‌లు అనిపిస్తాయి. ప్రేమమ్ లో నేను, సాయిపల్లవి, మడోన్నా — మేమంతా నటించిన పాత్రలు కథకు సమానంగా ఉందా లేదా చూడాలి . పాత్ర ఎంత బలంగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. స్క్రీన్ టైమ్ కంటే రోల్‌కు ఉన్న వెయిట్‌నే ఎక్కువగా పరిగణించాలి’’ అని క్లియర్‌గా చెప్పుకొచ్చింది అనుపమ.