మెగాస్టార్ చిరంజీవి, ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే..వీరిద్దరి కలయికలో ‘ఘరానా మొగుడు’, ‘ఆపద్బాంధవుడు’ మరియు ‘ఎస్.పి.పరశురామ్’ లాంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాల్లోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇప్పటికీ కూడా ఆ మూవీస్ లోని పాటలు వింటూ మ్యూజిక్ లవర్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి చిత్రాల కు కీరవాణి ఇచ్చే మ్యూజిక్ కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని కీరవాణి వెల్లడించారు.సంక్రాంతి కానుక గా ‘నా సామిరంగ’ సినిమా తో అక్కినేని నాగార్జునప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందించారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున, కీరవాణి , పాటల రచయిత చంద్రబోస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా కీరవాణి నాగార్జునతో పాటు చిరంజీవి మ్యూజిక్ సెన్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “నాగార్జున, చిరంజీవికి మ్యూజిక్ సెన్స్ ఎక్కువ. ఒక్కోసారి కంపోజింగ్ దగ్గర కూర్చొని మాకు ఇలా కావాలి, అలా కావాలి అని అడిగేవారు. వాళ్లు అడిగే విధానం ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ని ఇబ్బంది పెట్టేలా ఉండదు. ఇలా కావాలి అని అడగడమే కాదు, ఎందుకు కావాలి..అనే విషయాన్ని కూడా చెప్తారు. మ్యూజిక్ చేసే వాళ్లలో ఉత్సాహం కలిగేలా వ్యవహరిస్తారు. ‘ఘరానా మొగుడు’ సినిమా సమయం లో ‘బంగారు కోడిపెట్ట’ పాట చేస్తున్నాం. ముందు నేను ఓ ట్యూన్ చేశాను. ఇది స్టెప్స్ కు అనుకూలంగా లేదండీ, ఇలా మార్పులు చేయండి అని చిరంజీవిగారు అన్నారు. ఎలా చేయాలో నాకు వివరణ కూడా ఇచ్చారు.. ఆయన చెప్పినట్లే చేశాం. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. మ్యూజిక్ ను ఎంతో ఇష్టపడి వారికీ నచ్చినట్టుగా చేయించుకోవడం లో నాగార్జున, చిరంజీవి ముందుంటారు” అని ఆయన అన్నారు.