ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ఘటన ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలోచోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు వెళుతున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తుంది.. వేగంగా వచ్చిన బస్సు లింగంగుంట్ల బస్ స్టాప్ వద్దకు రాగానే అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టింది..
బస్సు ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది.. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు యాకసిరి హనుమాయమ్మ, గన్నవరపు శివపార్వతి , షేక్ హజరత్ వలీ మృతి చెందారు. గాయపడిన 13 మందిలో గోరంట్ల శివకుమారి , సురుగుల కోటేశ్వరమ్మ ల పరిస్థితి విషమంగా ఉంది.. మిగిలిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..