బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఅర్. బీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది అని ప్రజలకు తెలుసు అని అన్నారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఆ పోటీలో బీఆర్ఎస్ దే పై చేయి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల…